అమెరికా లోని విదేశీ విద్యార్థుల వీసాల రద్దులో సగానికి సగం మంది భారతీయ విద్యార్థుల ఎఫ్1 సవీసాల రద్దే ఉంటోందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆయా విద్యార్థుస్టూడెంట్ అండ్ ఎక్స్‌ఛేంజి విజిటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ( ఎస్‌ఇవిఐఎస్ ) రికార్డులు ఇటీవల కొన్ని నెలల్లో రద్దుకావడాన్ని గమనించినట్టు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఎఐఎల్‌ఎ) విడుదల చేసిన విధానం ప్రకారం ఇది బయటపడిందని పేర్కొంది. ఏప్రిల్ 17న విడుదలైన ఈ నివేదిక ఈ వీసాల రద్దు విదేశీ విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఏకపక్షంగా, పారదర్శకలోపంగా తీసుకుంటున్న నిబంధనలుగా ఆక్షేపించింది. 327 వ్యక్తిగత నివేదికల నుంచి సేకరించిన డేటా ప్రకారం అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఎఐఎల్‌ఎ) వీసాలు రద్దయిన విద్యార్థుల్లో 50 శాతం భారతీయులు కాగా, 14 శాతం మంది చైనీయులుతోపాటు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు.
యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (డిఒఎస్) , ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) కొత్తగా తీసుకుంటున్న విధానాల ప్రకారం కృత్రిమ మేథ (ఎఐ) సాధనాలను వినియోగించి విద్యార్థుల వీసాల సామాజిక మాధ్యమాల ప్రొఫైల్స్‌ను పరీక్షిస్తున్నారు. దీంతో ఆయా విద్యార్థులు ఎలాంటి నేరాల్లో దోషులు కానప్పటికీ చట్ట ప్రకారం వారి వీసాలు రద్దవుతున్నాయి. 202324 విద్యాసంవత్సరంలో అమెరికా లోని విదేశీ విద్యార్థుల్లో అత్యధిక శాతం భారతీయ విద్యార్థులే ఉన్నారు. మొత్తం 11,26,690 మంది విదేశీ విద్యార్ధుల్లో 3,31,602 మంది భారతీయ విద్యార్థులే ఉండడం గమనార్హం. అంటే మొత్తం విద్యార్థుల్లో వీరు 29 శాతం వరకు ఉన్నారు. భారత విద్యార్థుల తరువాత చైనా విద్యార్థులు 2.77 లక్షల వరకు ఉన్నారు. వీసాలు రద్దయిన భారతీయ విద్యార్థుల్లో చాలా మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) పరిధిలో ఉన్నవారే. వీరు అప్పటికే గ్రాడ్యుయేట్‌లై, ఉద్యోగాలు పొందిన వారు. ఇప్పుడు వీరంతా తమ ఎస్‌ఇవిఐఎస్ రికార్డు రద్దు అయిన తరువాత తిరిగి ఎలాంటి ఉద్యోగం కానీ పనికానీ పొందలేరు.
ఈమేరకు 2025 జనవరి 20 నాటి నుంచి 4736 ఎస్‌ఇవిఐఎస్ రికార్డులు రద్దయ్యాయి. వీరిలో చాలా మంది విద్యార్థులు ఎఫ్1వీసాలున్నవారే. 57 శాతం మంది వీసా రద్దు ఈ మెయిల్ ద్వారా నోటీసులు అందుకున్నారు. 83 శాతం మంది తమ యూనివర్శిటీల నుంచి వీసాల రద్దు సమాచారం తెలుసుకోగలిగారు. మరో 7 శాతం మంది ఎలాంటి నోటిఫికేషన్ అందుకోలేదు. ఇలాంటి విద్యార్థుల్లో 86 శాతం మందికి ఏదో ఒకస్థాయిలో పోలీసులతో సంబంధం ఉన్నట్టు తేలింది. 33 శాతం మందికి ఎలాంటి నేరారోపణలు కానీ విచారణ కానీ ఎదురు కాలేదు. కానీ ట్రాఫిక్‌కు సంబంధించి స్వల్ప సమస్యలే కనిపించి డిస్మిస్ అయ్యారు. ఈ విధంగా భారతీయ విద్యార్థుల వీసాల రద్దు సంఖ్య పెరుగుతుండడంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆందోళన వెలిబుచ్చారు.