Wednesday, April 30, 2025

అట్టారి మీదుగా 509 మంది పాక్ జాతీయుల నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌కు చెందిన 12 కేటగరీల స్వల్పకాలిక వీసాదారులకు దేశం వీడివెళ్లేందుకు గడువు ఆదివారం ముగియగా శుక్రవారం నుంచి మూడు రోజుల్లో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా 509 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి వాఘా సరిహద్దు మీదుగా భారత్ నుంచి నిష్క్రమించినట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో గల ఆ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 745 మంది భారతీయులు పాకిస్తాన్ నుంఇ తిరిగి వచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ నెల 22న పర్యాటకులు సహా 26 మందిని హతమార్చిన తరువాత ‘దేశం వీడివెళ్లండి’ అని పాకిస్తానీ జాతీయులకు ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది.

ఆదివారం అట్టారి వాఘా సరిహద్దు మీదుగా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా 237 మంది పాకిస్తానీ జాతీయులు భారత్‌ను వీడి వెళ్లారని, శనివారం 81 మంది, శుక్రవారం 191 మంది పాకిస్తానీ జాతీయులు అలా వెళ్లిపోయారని అధికారులు ‘పిటిఐ’తో చెప్పారు. కొంత మంది పాకిస్తానీలు విమానాశ్రయాల ద్వారా కూడా దేశం వదలి వెళ్లి ఉందవచ్చునని, అయితే, పాకిస్తాన్‌తో భారత్‌కు నేరుగా విమాన సర్వీసుల అనుసంధానం లేనందున వారు ఇతర దేశాలకు వెళ్లి ఉండవచ్చునని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News