Friday, July 11, 2025

తాలిబన్ జోక్యంతో తప్పిన 6 ఏళ్ల బాలిక వివాహం

- Advertisement -
- Advertisement -

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ బాలిక తల్లిదండ్రులు తమ ఆరేళ్ల బాలికను 45 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి నిశ్చయించారు. తానీ తాలిబన్ అధికారుల జోక్యంతో ప్రస్తుతానికి పెళ్లి నిలిచి పోయింది. బాలికకు 9 ఏళ్లు వచ్చే వరకూ ఎలాంటి పెళ్లి తలపెట్టవద్దని ఉభయ పక్షాలను అధికారులు ఆదేశించారు. ఈ ఉదంతం ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మంద్ ప్రావిన్స్ లో జరిగింది. ముర్జా జిల్లాలో జరిగిన ఘటనను అమెరికా ఆఫ్ఘన్ వార్తా సంస్థ అము .టివి జూన్ 28న మొదట రిపోర్ట్ చేసింది.
వరుడికి అప్పటికే వివాహం అయింది. ఇద్దరు భార్యలు ఉన్నారు.

అయినా, పేదరికం, ఆర్థిక కారణాల వల్ల బాలిక తల్లిదండ్రులే అతడితో తమ బిడ్డను మూడో భార్యగా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. తాలిబన్ అధికారులు జోక్యం చేసుకుని పెళ్లి రద్దు చేస్తారా.. అరెస్ట్ చేయాలా అని తీవ్రంగా హెచ్చరించడంతో వివాహం ఆగింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, పిల్లల హక్కుల విషయంలో చూపుతున్న వివక్షపై అంతర్జాతీయంగా నిరసన వెల్లువెత్తింది. మహిళలు, బాలికలు కు విద్య, ఉద్యోగ రంగాలలోనూ, మౌలిక హక్కులను నిరాకరించే తాలిబన్ ప్రభుత్వం విధానాలను అంతర్జాతీయ సంస్థలు, దేశాలు
విమర్శిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News