- Advertisement -
ఇజ్రాయెల్ భారీగా దాడులకు పాల్పడుతుండడంతో గాజాలో మరణమృదంగం మోగుతోంది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్ అంతటా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు టెల్‌అవీవ్ చేసిన వైమానిక దాడుల్లో 60 మంది మరణించినట్టు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. ఉత్తర గాజాలో పనిచేస్తున్న మూడు ఆస్పత్రులూ తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం సమస్యగా మారిందని అధికారులు వాపోయారు. ఇందులో గాజా ప్రజలకు వైద్యం అందిస్తున్న ఇండోనేసియా ఆస్పత్రి కూడా ఉందని తెలిపారు.
- Advertisement -