- Advertisement -
గోవాలో పెను విషాదం చోటుచేసుకుంది. షిర్గావ్‌లో శ్రీ లైరాయ్ జాత్రా సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి), మపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంతి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -