Saturday, June 28, 2025

రాష్ట్రంలో కొత్త ఇంజనీరింగ్ సీట్లు 720

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పలు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం అదనంగా 720 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా 240 సీట్లు అందుబాటులోకి రాగా, అందులో 60 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, 60 సిఎస్‌సి(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), 60 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 60 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అలాగే పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి రాగా, 60 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్,

60 సిఎస్‌సి(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్), 60 సిఎస్‌ఇ(డాటా సైన్స్) సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా అప్‌గ్రేడ్ అవుతున్న కొత్తగూడెం యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో 300 సీట్లు అందుబాటులోకి రాగా, 60 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, 60 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 60 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనియేషన్ ఇంజనీరింగ్, 60 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 60 మైనింగ్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News