Saturday, May 17, 2025

ఫ్రిజ్‌లోని పండ్లు తిని.. బంగారంతో ఉడాయించిన దొంగలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో(Chaderghat) భారీ దొంగతనం జరిగింది. ఫహిముద్దీన్ అనే వ్యాపారి ఇంట్లో నుంచి దొంగలు 75 తులాల బంగారు నగలు(Gold), రూ.2.50 లక్షల నగదుతో ఉడాయించారు. వివరాల్లోకి వెళితే.. ఫహిముద్దీన్‌ భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం రాత్రి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచి ఆస్పత్రికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు వెనుక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెం పెట్టారు. ఫ్రిజ్‌లో ఉన్న పండ్లను హాయిగా తిని.. ఆ తర్వాత బీరువాలో ఉన్న బంగారం, నగదు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటికి రాగానే ఫహిముద్దీన్‌ దొంగతనం జరిగిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News