- Advertisement -
20 మందికి గాయాలు కర్నాటకలోని హసన్
జిల్లాలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదం
హసన్ : కర్నాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో ఒక ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందగా, మరో 20మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. గణేశ్ చతుర్థి ఉత్సవాల ముగింపు రోజున మోసాలే హోసహళ్లి గ్రామంలో రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. అరకలగూడు నుండి ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్న ట్రక్కు అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది.
దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృత్యువాత పడగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం హసన్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -