- Advertisement -
‘మ్యాడ్’ మూవీ ఫేం అనంతిక సానిల్ కుమార్ ప్రధానపాత్రలో తెరకెక్కిన్న సినిమా ‘8 వసంతాలు’. డైరెక్టర్ ఫణింద్ర రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ కొద్దిసేపటిక్రితమే విడుదలైంది. ఇందులో విజువల్స్ నాచురల్ గా, అద్భుతంగా ఉన్నాయి. ‘ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు’, ‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి.. ఆడదాని ప్రేమకు ఏముంటాయి, మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. బ్యూటీఫుల్ లవ్ స్టోరితోపాటు ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలతో వదిలిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పెద్ద నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -