Sunday, June 8, 2025

ఆసక్తికరంగా ‘8 వసంతాలు’ సెకండ్ టీజర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటి అనంతిక సానిల్ కుమార్. ఆమె ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasantalu). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. తాజాగా ఈ సినిమా సెకండ్ టీజర్‌ను విడుదల చేశారు. హీరో పాత్రని పరిచయం చేస్తూ.. చిత్ర యూనిట్ ఈ టీజర్‌ని వదిలింది. ఈ టీజర్‌ చూస్తే హీరో ఈ సినిమాలో రచయిత అని అర్థం అవుతోంది. టీజర్‌లో చెప్పే డైలాగ్స్ ఆద్యంతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News