Tuesday, May 13, 2025

పొల్లాచి లైంగిక వేధింపుల కేసు.. 9 మందికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో కోర్డు సంచలన తీర్పు వెల్లడించింది. తీర్పు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన కోయంబత్తూరు మహిళా ప్రత్యేక కోర్టు.. వారికి జీవిత ఖైదు విధించింది. బాధిత మహిళలకు రూ.85 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

2019 కేసులో ఈ ముఠా మహిళలను స్నేహం పేరుతో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురిచేసి బ్లాక్‌మెయిల్ చేసింది. ఓ బాధితురాలు దొంగతనం ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత ఈ కేసు మొదట వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సమయంలో పోలీసులు లైంగిక వేధింపుల ఘటనలను గుర్తించారు. తర్వాత లైంగిక దాడుల వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు అంతటా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది, అప్పటి పాలక AIADMKపై నిరసనలు, రాజకీయ వ్యతిరేకతకు దారితీసింది. DMK, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ర్యాలీ చేసి, మహిళల భద్రతను కాపాడటానికి న్యాయం, వ్యవస్థాగత సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి.

ప్రారంభంలో ఈ కేసును క్రైమ్ బ్రాంచ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID) దర్యాప్తు చేసింది. తరువాత తీవ్రమైన ప్రజా ఒత్తిడితో ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆరేళ్లుగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐ.. అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో మహిళా కోర్టు జడ్జీ జస్టిస్ నందిని దేవి.. నిందితులుగా ఉన్న తిరునావుకరసు, శబరీషన్, వసంత కుమార్, సతీష్, మణివన్నన్, హరన్‌పాల్, బాబు, ఆరులనాథం, అరుణ్ కుమార్‌ లను భారత శిక్షాస్మృతిలోని బహుళ సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News