అందరూ ఎక్కువ డేటా ప్రయోజనాలతో వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లను ఇష్టపడుతారు. అందుకే జియో, వీ ఐడియా, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు వినియోగదారులకు వివిధ ప్లాన్‌లను అందిస్తున్నాయి. రూ.100 ప్లాన్‌ను రిలయన్స్ జియో అందిస్తోంది.దీని చెల్లుబాటు 90 రోజుల వరకు ఉంటుంది. జియో ఈ సరసమైన రీఛార్జ్ అనేది వినియోగదారులకు 90 రోజుల పాటు డేటా ప్రయోజనాలను అందించే డేటా ప్లాన్.
జియో రూ.100 ప్లాన్ వినియోగదారులకు మొత్తం 5GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ లో 90 రోజుల పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందొచ్చు. అంతేకాకుండా 5G కనెక్టివిటీ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ.100 రీఛార్జ్‌తో మొత్తం 5GB డేటా, JioHotstarకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అయితే, ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన జియో కస్టమర్లు రూ.100 డేటా ప్లాన్ ప్రయోజనాన్ని పొందుతారు. సులభంగా చెప్పాలంటే.. ఈ జియో ప్లాన్ ఇప్పటికే ఉన్న ప్లాన్‌తో అందుబాటులో ఉంది.