Thursday, August 21, 2025

నేటి యువత వివేకానందుడి అడుగు జాడల్లో నడవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: సమాజంలో ఒక మంచి మార్పు కోసం వివేకానందుడి ఆశయాలకు అనుగుణంగా యూత్‌ఫర్ యాంటీ కరప్షన్ సంస్ద నిరంతరం ముందుకు పోతుందని ఆసంస్ద ఫౌండర్ పల్నాటి రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యాక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిత్వమే మనిషిని మహోన్నతమైన మహనీయునిగా మారుస్తుందని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. ఆలోచన, ఆచరణ, విజయం వివేకానందుని విధానమని, ఆమహానీయుడి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. యువత సమాజం పట్ల బాధ్యత కలిగి సమస్యలపై స్పందించాలన్నారు. మంచి సమాజం, మంచిఆలోచనలతోనే సాధ్యమైతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News