Wednesday, July 16, 2025

మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా పోలీసుల కూంబింగ్

- Advertisement -
- Advertisement -

Police combing targeted top Maoist leaders

హైదరాబాద్: రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతలే లక్ష్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురంతో పాటు భద్రాద్రి కొత్త గుడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం ఏరియా కమిటీ నేతలే టార్గెట్గా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల సంచారానికి సంబంధించి పోలీసులకు కీలక సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. సమచారం వచ్చిన వెంటనే పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసుల సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ జరుగుతోంది. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలను ఏరివేసేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News