Friday, May 3, 2024

ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన దానం

- Advertisement -
- Advertisement -

Kalyan Laxmi cheques distribute to Beneficiaries

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇస్తున్నామని టిఆర్ఎస్ ఎంఎల్ఎ దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజవర్గం సింగాడ బస్తి, జాహ్రా నగర్, గౌరీశంకర్ కాలనీ, దేవరకొండ బస్తీ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎంఎల్ఎ దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ రోజు 35 మంది లబ్ధిదారులకు చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లలకు పెండ్లి భారం కాకూడదని ఇలాంటి కార్యక్రమము చేపట్టామని, ముఖ్యమంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు చెప్పారు.  ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని, కెసిఆర్ లాంటి వ్యక్తి సిఎంగా రావడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి పేదవారి ఇంటికి చేరుతుందని, రైతుబంధు సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయన్నారు.  కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా అడబిడ్డల కళ్ళలో ఆనందం కనబడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చెక్కులు అందజేస్తామని, ఫార్ములా ఈ హైదరాబాద్ కు వస్తుండడంతో ఇది చాలా చారిత్రకమైనదని కొనియాడారు.

ప్రత్యేకంగా మా నియజకవర్గం లో రావడం మంత్రి కెటిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో చాలా పెద్ద ఈవెంట్  హైదరాబాద్ కు రావడం గర్వకారణమని ప్రశంసించారు. టెక్ మహీంద్రా వారు చాలా ఉత్సాహం చూపుతున్నారని ప్రశంసించారు. హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో మంత్రి కెటిఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, టెస్లా కంపెనీ మా వద్ద రావాలని ఎలెన్ మాస్క్ ని ఆహ్వానించడంతో చాలా రాష్ట్రాలు పోటీ పడి ముందుకు వచ్చి కెటిఆర్ బాటలో నడుస్తున్నాయని ప్రశంసించారు. కెటిఆర్ ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధి పథం లో ముందుకు వెళుతుందని కొనియాడారు. చినజీయర్ స్వామి మీద ప్రతి పక్షాలు రాజకీయం చేయడం మంచిది కాదని హితువు పలికారు. చినజీయర్ స్వామి తలపెట్టిన యజ్ఞం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని, ఇలాంటి కార్యక్రమము మీద చిల్లర వాక్యాలు చేయడం సరికాదు ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News