Friday, May 3, 2024

ఇడి కస్టడీలో సర్వోమాక్స్ ఎండి

- Advertisement -
- Advertisement -

Servomax MD in ED custody

హైదరాబాద్: బ్యాంక్ నుంచి పొందిన రుణాలను డొల్ల కంపెనీలకు తరలించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన సర్వోమాక్స్ ఎండి అవసరాల వేంకటేశ్వర్‌రావును ఇడి అధికారులు శనివారం కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉన్న వెంకటేశ్వరరావును ప్రశ్నించేందుకు కోర్టు నాలుగు రోజుల పాటు అనుమతినిచ్చింది. దీంతో ఆయనను విచారించేందుకు అధికారులు ఇడి కార్యాలయానికి తరలించి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లింపు సంబంధించి ప్రశ్నించారు. పలు బ్యాంకుల నుంచి రూ.402 కోట్ల వరకు రుణం తీసుకున్న వెంకటేశ్వరరావు ఆయా మొత్తాలను సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఇడి అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

అదేవిధంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి పలు కోనుగోళ్లు చేసినట్లు, లావాదేవీలు నిర్వహించినట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు విచారణలో తేలింది. కాగా బ్యాంకుల ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపు కింద కేసు నమోదు చేసిన ఇడి అధికారులు సర్వోమాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు వేంకటేశ్వరరావు, ఆయన బినామీలకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఈ కేసులో వెంకటేశ్వరరావును ప్రశ్నించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇడి అధికారులు నాలుగు రోజుల పాటు విచారణ చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News