Saturday, May 25, 2024

వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు తనకు సందేశాలు పంపిస్తున్నారని కెటిఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరినీ వీలైనంత త్వరగా దేశానికి రప్పించేలా చర్యలు తీసు కోవాలని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా స్వదేశానికి తిరగి రావాలని కోరుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వారిని రప్పించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

KTR Tweet MEA to return Tulugu students from Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News