Thursday, May 2, 2024

నెదర్లాండ్స్ అమెరికా రాయబారిగా శ్రీమతి దుగ్గల్

- Advertisement -
- Advertisement -

Mrs. Duggal as US Ambassador to Netherlands

భారతీయ సంతతి మహిళ నియామకం

వాషింగ్టన్ : అమెరికాలో భారతీయ సంతతి మహిళ షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్ రాయబారిగా నియమించారు. ఈ మేరకు ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటన వెలువరించారు.. ఈ భారతీయ సంతతి వ్యక్తి రాజకీయ కార్యకలాపాలతో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 50 సంవత్సరాల షెఫాలీ భారత్‌లోని జమ్మూ కశ్మీర్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆమె అమెరికాలో పలు ప్రాంతాలలో ఉంటూ వచ్చారు. బైడెన్ అధికార యంత్రాంగం, దౌత్యవేత్తల ఎంపిక ప్రక్రియలో భాగంగా శనివారం వైట్‌హౌస్ నుంచి పలు నియామక ప్రకటనలు వెలువడ్డాయి. ఇందులో నెదర్లాండ్స్‌కు అమెరికా దౌత్యవేత్తగా నియమితులైన దుగ్గల్ ఇద్దరు పిల్లల తల్లి. అమెరికాలో రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ కర్తగా, మానవ హక్కుల ప్రచార బాధ్యతలతో కృషిచేస్తున్నారు. ఇంతకు ముందు కూడా కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు దేశ పశ్చిమ ప్రాంత సలహాదారుగా అమెరికా అధ్యక్షులకు సహకారం అందిస్తున్నారు. న్యూయార్క్ యూనివర్శిటీలో పొలిటికల్‌కమ్యూనికేషన్‌లో ఎంఎం పట్టా పొందారు. మియామీ వర్శిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ తీసుకున్నారు. పలు పౌర పురస్కారాలు అందుకున్న ఘనత వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News