Friday, November 1, 2024

డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్

- Advertisement -
- Advertisement -

CM KCR fires on bjp

శాసనసభలో కేంద్రాన్ని చీల్చిచెండాడిన కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారు. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్ అని బిజెపి పాలిత రాష్ట్రాలలో సాగుతున్ననాసిరకం అభివృద్ధిని గురించి సిఎం కెసిఆర్ తన శాసనసభ ప్రసంగంలో ఎత్తిపొడిచారు. బయట ఒకాయన… డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయ్ అని మాట్లాడారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే సర్కారు అని అర్థం. అది ఎంత వెకిలిగా, అసహనంగా ఉందంటే.. అది కూడా ప్రజలను గోల్మాల్ తిప్పే పరిస్థితి. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం 71వేలు. తెలంగాణ తలసరి ఆదాయం 2.87 లక్షలు. ఆర్థిక వృద్ధి రేటు యూపిలో 7.26 శాతమైతే.. తెలంగాణ 10.8 శాతంగా ఉంది’ అని కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.78 లక్షలుగా ఉందని వెల్ల డించారు. ఉత్తరప్రదేశ్ కంటే తెలంగాణనే వృద్ధి ఎక్కువగా ఉందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీలోనే మాతాశి శుమరణాల రేటు ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రాలా?

‘దేశంలో ఆర్థిక విధానాన్ని నిర్ణయించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం. కొద్దిమేర మాత్రమే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుంది. ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ ధోరణి ఉంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలో ఉంది. అలాంటి రాష్ట్రాలను అణచివేసే చర్యలను కేంద్రం చేపడుతోంది. కేంద్రం పనితీరు తెలంగాణ కంటే దిగజారిపోయింది. ప్రస్తుతం భారత్ అప్పు రూ.152 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 58.5 శాతం అప్పులు తీసుకుంటోంది. రాష్ట్రాలు మాత్రం 25 శాతంలోపు అప్పు తీసుకోవాలని ఉంది. కేంద్రం ఇష్టానుసారం నిధుల అప్పులు చేసే రాష్ట్రాల క్రమంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. కేంద్రం తీరుతో కోట్ల మంది పేదరికంలోకి వెళ్లారని, జిడిపి తగ్గిందని, పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. దేశం ఆత్మ నిబ్బరం కోలోతున్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News