Friday, May 10, 2024

ఆరున్నర ఏళ్లలో బ్యాంకులు రూ.7.34 లక్షల కోట్లు రికవరీ

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి భగవత్ కరాద్ వెల్లడి

న్యూఢిల్లీ : గత ఆరున్నర ఏళ్ల కాలంలో బ్యాంకులు దాదాపు రూ.7.34 లక్షల కోట్లను రికవరీ చేశాయని ప్రభుత్వం పార్లమెంట్‌లో పేర్కొంది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఆరు ఆర్థిక సంవత్సరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎలు), రిటన్ ఆఫ్ లోన్ ఖాతాల నుంచి బ్యాంకులు రూ.7,34,542 కోట్లను బ్యాంకులు రికవరీ చేశాయని ఆయన వెల్లడించారు. మోసపూరిత నగదు రికవరీపై మంత్రి స్పందిస్తూ, గత ఆర్థిక సంవత్సరాల్లో, అలాగే 2021 డిసెంబర్ 31 ముగింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.55,895 కోట్లను వసూలు చేశామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News