Wednesday, May 22, 2024

హోలీ పండుగ రజనీ కాంత్‌కు స్పెషల్!

- Advertisement -
- Advertisement -

Super Star Rajanikanth
చెన్నై: హోలీ పండుగను ఉత్తరాదిన ఘనంగా జరుపుకుంటారు. కానీ ఆ పండుగతో సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితం ముడిపడి ఉంది. 1975 మార్చి 27…అది హోలీ పండుగ రోజు. నాడు శివాజీ రావు గైక్వాడ్ అనే ఓ సాధారణ బస్ కండక్టర్ తన ఉద్యోగాన్ని వదిలేసి మద్రాస్‌లోని ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతడే నేడు రజనీకాంత్‌గా సుప్రసిద్ధుడు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కె. బాలచందర్ ఆయనకు సినీ రంగంలో అవకాశం కల్పించారు. ఆరు నిమిషాల ఒక వీడియోలో కీ.శే.బాలచందర్, రజనీకాంత్ 1975నాటి హోలీ పండుగను గుర్తుచేసుకున్నారు. బాలచందర్ ప్రొడక్షన్ కంపెనీ ‘కవితాలయ’ ఆ వీడియోను 2020లో అప్‌లోడ్ చేసింది.
రజనీకాంత్ వాస్తవానికి ఓ మరాఠి. ఆయన తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. అతడిని అతడి సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ బెంగళూరులో పెంచారు. యువకుడైన శివాజీ రావుకు సినిమాలో నటించాలని ఆరాటం. కానీ తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అతడి వద్ద డబ్బు కూడా అప్పుడు లేదు. అప్పుడు ఏ బస్సులోనైతే అతడు కండక్టర్‌గా పనిచేశాడో ఆ బస్సు డ్రైవర్ రాజా బహదూర్ అతడికి సాయపడ్డాడు. దాంతో ఆయన తన స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి మద్రాస్ చేరాడు. శివాజీ రావు 1974లో బాలచందర్‌ను కలిశాడు. కొన్ని నెలల తర్వాత కనిపించమని అప్పుడు బాలచందర్ ఆయనకు చెప్పాడు. అది కట్ చేస్తే… 1995 మార్చి 27. ‘ఒకరోజు కెబి బాలచందర్ సార్ నన్ను ఆయన కళాకేంద్ర ఆఫీసులో కలవమాన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆయన తన ఆఫీసులో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. నన్ను కూర్చోమని అన్నారు. తర్వాత మాటామంతీ కెబిగారు నా నటన కౌశలాన్ని చూపమన్నారు. నేను నటించి చూపాను. తర్వాత కొన్ని నిమిషాలు మా మధ్య మౌనం చోటుచేసుకుంది. ఆయన నా నటన పట్ల సంతోషించలేదని, నన్ను తిడతారని భావించాను’ అని వీడియోలో రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ‘ఆ తర్వాత నాలుగు నిమిషాలకు, చూడు మిష్టర్ శివాజీ రావు, నేను నిన్ను నా మూడు సినిమాల్లో బుక్ చేసుకుంటున్నాను. నేను నిన్ను పరిచయంచేయబోతున్నాను’ అని బాలచందర్ చెప్పారు. అప్పుడే ఆయన రజనీకాంత్‌తో ‘ఇకపై సినిమాల్లో నీ పేరు రజనీకాంత్…రజనీకాంత్…ఒకేనా’ అన్నారు. దాంతో శివాజీరావు పేరు కాస్తా రజనీకాంత్‌గా మారిపోయింది. ఆయనే నేడు దక్షిణాది సూపర్ స్టార్. ఇక బాలచందర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగల్’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News