Wednesday, September 17, 2025

ఆగని పెట్రో బాదుడు..

- Advertisement -
- Advertisement -

Petrol Price hiked by 80 paise

ఆగని పెట్రో బాదుడు
లీటరుపై మరో 80 పైసలు పెంపు
13 రోజుల్లో 11వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై 80 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.103.41కి చేరుకోగా, డీజిల్ ధర రూ.94.67కు చేరింది. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర అత్యధికంగా రూ.118.41కి చేరుకోగా, డీజిల్ 102.64కు చేరుకుంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌పై లీటరుకు 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు రూ.117.21, డీజిల్ రూ.103.03కు చేరుకుంది. గత 13 రోజుల్లో 11సార్లు చమురు కంపెనీలు ఇంధన ధరలు పెంచగా, రూ.8కి పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

Petrol Price hiked by 80 paise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News