Thursday, May 9, 2024

సమాజ సేవతోనే మానవ జీవితం సార్థకం: తలసాని

- Advertisement -
- Advertisement -

Human life is meaningful with community service

 

మన తెలంగాణ /సిటీ బ్యూరో: సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్థకత లభిస్తుందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం అమీర్‌పేట డివిజన్‌లోని బికె గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిత బోజన కేంద్రంతో పాటు చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 2011లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా వేసవికాలంలో రెండు నెలల పాటు మధ్యాహ్న భోజనం అందించడం సంతోషకరమంటూ నిర్వహకులను అభినందించారు.

అనేక మంది ఆకలిని తీర్చే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటున్న సీనియర్ సిటిజన్ సేవలను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని తనవంతుగా సహాయంగా రూ.2లక్షలను శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్థసారధికి అందజేశారు. అంతకు ముందు సీనియర్ సిటిజన్ సభ్యులు నరసింహగౌడ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘంటించారు. అదేవిధంగా గత 11 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తున్న డాక్టర్ శ్యామ సుందర్ రాజ్దం పతులను మంత్రి అభినందనలు తెలిపారు.

అంతకుమందు మేనేజింగ్ ట్రస్టీ పార్థసారధి మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండుపాటు ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయ్యామని, ఇప్పడు మళ్లీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, ట్రస్టీ సభ్యులు కృష్ణారెడ్డి, విఠల్‌రెడ్డి,రామమూర్తి, బికెఎం సత్యనారాయణ, సీనియర్ సిటిజన్ సభ్యులు సహదేవ్ గౌడ్, సాయి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News