Tuesday, April 30, 2024

టమాట కూరకాదు పండు

- Advertisement -
- Advertisement -

Tomato is a non-stick fruit

లండన్ : విచిత్రమైన రీతిలో పండ్లు కూరగాయలుగా చలామణిలోకి వచ్చాయి. పది కూరలు నిజానికి పండ్లు అని వాటి ప్రయోజనాలు కూడా పండ్లలోని లక్షణాలకు సరితూగేవిగా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఇంటా టమాట వంట ఉండనే ఉంటుంది. దీనిని టమాట శాఖాహారపు కూరగా తీసుకుంటాం. అయితే టమాట కూరగాయ కాదని ఇది రసంతో కూడిన పండు అని వెల్లడైంది. ఇందులో రసం శాతం ఎక్కువగా ఉంటుంది. పండు అయిన టమాట కూరగా గుర్తింపు దక్కించుకుంది. ఇందులో విటమిన్లు, పొటాసియం మోతాదులు ఎక్కువ. పైగా సామాన్యుడి వంటకంగా పేరొందింది. అదే విధంగా కుకుంబర్, ఒక్రా లేదా బెండ కద్దూ, పెప్పర్ వంటివి కూరలుగా వెలుగులోకి వచ్చిన పండ్లు అని తేలింది. ఇక మొక్కజొన్న కండెలు సాధారణంగా కూరల శ్రేణికి వస్తాయి. కానీ వృక్షశాస్త్రపరంగా చూస్తే ఇవి పండ్లు రకానికి చెందినవి. బటానీలు కూడా ఈ తేడా గ్రూప్‌లోకి చేరుకున్నవే. ఇక బీన్స్ కూడా పండు అయితే కూరల వరసలో చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News