Monday, August 18, 2025

పోలాండ్ బొగ్గుగనిలో పేలుడు… నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Poland coal mine blasts kill four

 

వార్సా (పోలాండ్): దక్షిణ పోలాండ్ బొగ్గుగనిలో బుధవారం మెథేన్ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. 19 మంది గాయపడ్డారు. పాలోవిస్ ప్రాంతంలో నివోవిక్ గనిలో మూడువేల అడుగుల లోతున ఈ ప్రమాదం సంభవించింది. మంటలు కమ్ముకుంటుండంతో వెంటనే పనులను ఆపేశారు. సహాయ కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నారు. ప్రధాని మెత్యూస్జ్ మొరావికీ తాను గని దగ్గరకు వెళ్లి చూసేవాడినని, అయితే రిస్కు ఆపరేషన్ చాలా కష్టమని చెప్పారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News