Tuesday, May 7, 2024

యదార్థ సంఘటనల ఆధారంగా …

- Advertisement -
- Advertisement -

 

శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన సినిమా ‘1996 ధర్మపురి’. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రముఖ దర్శకుడు మారుతి, మైత్రి మూవీ మేకర్స్ రవి, నిర్మాత యస్.కె.యన్, జివి,సెవెన్ హిల్స్ సతీష్, డార్లింగ్ స్వామి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ “ధర్మపురి ప్రాంతంలో వుండే గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ అక్కడ జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గోదావరి తీరాన చాలా పురాతనమైనటువంటి ధర్మపురి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ ధర్మపురి పేరిట సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు జగత్ మాట్లాడుతూ “మేము ఈరోజు సినిమా పూర్తి చేయగలిగాము అంటే దానికి ముఖ్య కారణం శేఖర్ మాస్టర్. నిర్మాత భాస్కర్ మాకు ఏం కావాలన్నా అన్ని విధాల సహకరించారు. ఈ సినిమాలోని నాగమల్లి, సూరి క్యారెక్టర్‌లు నేచురల్‌గా ఉంటాయి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో గగన్, హీరోయిన్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News