Thursday, September 11, 2025

‘కళావతి…’ అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

Kalavathi lyrical Song Cross 150 Million Views

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్‌ని సృష్టించింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ పాట మెలోడీ అఫ్ ది ఇయర్‌గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన కళావతి పాట ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 150 మిలియన్ వ్యూస్‌ని దాటి అరుదైన రికార్డు నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్‌లో టాప్ సాంగ్ లిస్టులో కొనసాగుతోంది. యుట్యూబ్‌లో కూడా ట్రెండింగ్ వీడియోస్‌లో చాలా రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగింది.

ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్‌ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యం అందించగా సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్‌తో మైమరపించారు. కళావతి పాటతో పాటు పెన్నీ, టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ‘సర్కారు వారి పాట’ నుంచి మాస్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ’సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Kalavathi lyrical Song Cross 150 Million Views

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News