Monday, May 13, 2024

పెట్రోల్ ధరాఘాతం పాపం కేంద్రానిదే

- Advertisement -
- Advertisement -

Centre hiked taxes on petrol: Priyanka gandhi

మోడీ సర్కారుపై ప్రియాంక ఆగ్రహం

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. 2014-15, 2020-21 మధ్య పెట్రోల్, డీజిల్‌పై పన్నులను మోడీ ప్రభుత్వం 250 శాతం పెంచిందని ప్రియాంక తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో అధిక ఇంధన ధరలను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ శాతాన్ని తగ్గించాలంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం పుట్టించిన నేపథ్యంలో ప్రియాంక కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 2014లో లీటర్ పెట్రోల్‌పై ఎక్సయిజ్ పన్ను కేవలం రూ. 9.48 ఉండగా డీజిల్‌పై రూ. 3.56 శాతం ఉండేదని ప్రియాంక శుక్రవారం ట్వీట్ చేశారు. గడచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సయిజ్ సుంకాన్ని 250 శాతం పెంచినట్లు వెలువడిన ఒక వార్తా కథనాన్ని కూడా ప్రియాంక జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News