Wednesday, September 17, 2025

రోహిత్, కోహ్లికి అండగా నిలిచిన గంగూలీ..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. మళ్లీ పుంజుకునే సత్తా వీరికుందన్నాడు. ఐపిఎల్‌లో విఫలమైనంత మాత్రాన వీరిని తక్కువ అంచనా వేయలేమన్నాడు. అపార అనుభవం ఉన్న కోహ్లి, రోహిత్‌లు మళ్లీ పూర్వ వైభవం సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు. రానున్న టి20 ప్రపంచకప్ నాటికి వీరిద్దరూ మళ్లీ గాడిలో పడడం ఖాయమన్నాడు. కాగా, ఐపిఎల్‌లో పలువురు యువ క్రికెటర్లు అసాధారణ రీతిలో రాణిస్తున్నారని, ఇది భారత క్రికెట్‌కు ఎంతో శుభసూచకమన్నాడు. యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. రానున్న రోజుల్లో అతను టీమిండియాకు ప్రధాన అస్తంగా మారినా ఆశ్చర్యం లేదన్నాడు.

Sourav Ganguly supports Rohit and Kohli Struggling in batting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News