మనతెలంగాణ/సిటీ బ్యూరో: చేసే పనిలో అకింత భావం ఉంటే అందులో విజయం తథ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోస్సవం సందర్భంగా నిర్వహించిన విశిష్ట గురు పురస్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ కి అకాడమీ కార్య నిర్వాహక సభ్యులు డా. ఎస్. పి.భారతినికి విశిష్ట గురు పురస్కారాన్ని అందజేసి జ్ఞాపిక, ప్రశంసాపత్రంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ డా.భారతి గత 40 ఏళ్లుగా నాట్య గురువు గా, కళాభి నెత్రిగా ఎంతగానో రాణిస్తున్నారు అన్నారు. ఆమెను ప్రేరణగా తీసుకొని యువ కళాకారులు స్ఫూర్తి పొందాలని మంత్రి సూచించారు.
నాట్య రంగం లో ఎందరో కళాకారులు ఆమె శిక్షణలో భిన్న వేదికలపై ప్రదర్శనలతో అలరిస్తుండడ అభినందనీయమన్నారు. విద్య తో పాటు వినోదం, జీవితం ఎదుగుదలలో ఎంతో అవసరం మని మంత్రి పేర్కొన్నారు..తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ డా.సుదర్శన్ మాట్లాడుతూ డా ఎస్. పి. భారతి ఎంతో అంకిత భావంతో శిక్షణ పొందారని అన్నారు. కార్యక్రమానికి ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించగా ,సామాజికవేత్త నగేష్ పెండ్యాల తో పాటు పలువురు కళాభిమానులు పాల్గొన్నారు.