Thursday, August 28, 2025

ఓటిపి సైబర్ నేరస్థుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Fraud knowing OTP from bank account holders

మనతెలంగాణ, హైదరాబాద్ : బ్యాంక్ ఖాతా దారుల నుంచి ఓటిపి తెలుసుకుని వారి డబ్బులు కాజేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన వారిని జార్ఖండ్ నుంచి రాష్ట్రానికి తీసుకుని వచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ దేవ్‌ఘర్ రాష్ట్రానికి చెందిన అక్రం అన్సారీ, షాంశుద్దిన్ అన్సారీ, అనూప్ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు కలిసి ఒటిపి నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులకు ఫోన్లు చేసి వారి మొబైల్‌కు వచ్చిన ఓటిపి చెప్పమని మోసం చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని, ఎటిఎం కార్డు ఎక్పైపైరీ అయిందని చెప్పి బాధితుల నుంచి ఓటిపి తెలుసుకుని వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బులను దోచుకుంటున్నారు. గతంలో ఈ ముగ్గురిపై నగరంలో కేసులు నమోదు కావడంతో పోలీసులు గత కొంత కాలం నుంచి వెతుకుతున్నారు. ఎట్టకేలకు నిందితులను వారి సొంత రాష్ట్రంలో పోలీసులు పట్టుకోగా నగర పోలీసులు పిటి వారెంట్‌పై ఇక్కడికి తీసుకుని వచ్చారు. నిందితులకు కోర్టు రిమాండ్‌కు పంపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News