Wednesday, May 15, 2024

భారత్ ఆదుకుంటుందనే ఆశ: లంక ప్రధాని

- Advertisement -
- Advertisement -

కొలంబో: ప్రస్తుత దేశ క్లిష్ట దశలో ఎగువన ఉన్న భారతదేశం సాయాన్ని తాము ఎక్కువగా ఆశిస్తున్నామని దేశ ప్రధాన మంత్రి రనీల్ విక్రమసింఘే తెలిపారు. ఎన్‌డిటివికి ఆయన శనివారం ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న పలు చిక్కు సమస్యల గురించి ప్రస్తావించారు. ప్రత్యేకించి భారత్‌తో ఉన్న సంబంధాల గురించి మాట్లాడారు. భారత్ నుంచి ఎక్కువగా సాయం అందుతోందని, క్లిష్టతలను అధిగమించేందుకు తాము ఇప్పుడు ఎక్కువగా భారత్ సాయం కోసం వేచి ఉన్నామని అన్నారు. ఇక చైనాతో రుణ సంబంధిత బంధాలు ఉన్నాయని అన్నారు. దీవులలోని తమిళులకు అధికార వికేంద్రీకరణ విషయంలో పరిశీలన జరుగుతున్నట్లు తెలిపారు. అయితే తమకున్న పరిధులు, పరిమితులతో తాము అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇది తమకు ప్రభుత్వ ప్రధానిగా కత్తిమీద సామే అవుతుంది. అయితే తప్పదని, భారత్‌తో చైనాతో జపాన్‌తో అనేక విధాలుగా స్నేహ సంబంధాలు నెరపాల్సి ఉంటుందన్నారు. అయితే కొన్ని హెచ్చుతగ్గులు ప్రత్యేకతలు ఉండనే ఉంటాయని వివరించారు. జపాన్‌తో కూడా వియ్యం అనివార్యం అన్నారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని అంగీకరించారు. అయితే ఇది విషమ స్థితికి రాకుండా అన్ని నివారణ చర్యలూ తీసుకుంటామని, ఇవి సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామని అన్నారు.

Sri Lanka PM Speaks with NDTV on India help

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News