Monday, May 6, 2024

సోదరిని భారం అనుకోరాదు

- Advertisement -
- Advertisement -

Brother Can't Be Mute Spectator to Divorced Sister's Miseries

కుటుంబ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు

న్యూఢిల్లీ : విడాకులు పొంది పుట్టింటికి వచ్చిన సోదరి కడగండ్ల గురించి సోదరుడు మౌన పాత్ర వహించడం కుదరదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆమెకు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతూ ఉండవచ్చు, ఈ దిశలో సోదరుడు పట్టించుకోకుండా ఉండటానికి వీల్లేదని బుధవారం హైకోర్టు స్పష్టం చేసింది. వయో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకునే కనీస బాధ్యత వారి సంతానంపై ఉంటుంది. ముసలితనంలో వారిని నిరాదరించరాదని హైకోర్టు పేర్కొంది. తల్లిదండ్రుల పండుటాకుల దశలో వారిని గాలికి వదిలివేయడం తగదని తెలిపారు. సంబంధిత అంశాలపై న్యాయస్థానం వ్యాఖ్యలు ఓ మహిళ వేసిన కేసు దశలో వెలువడ్డాయి. తన మాజీ భర్త వద్ద ఉంటోన్న విడాకులు పొందిన సోదరి పోషణ బాధ్యతను పుట్టింటివారు తీసుకోవడం కుదరదని , ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వరణ కాంత శర్మ కీలకమైన రూలింగ్ ఇచ్చారు.

‘ నా అభిప్రాయం మేరకు ఈ పిటిషనర్ వాదనలో అర్థం లేదు. భారతదేశంలో ఓ కుటుంబంలోని పిల్లల మధ్య సంబంధాలు అవినాభావమైనవి. పరస్పరం ఆధారపడి ఉండటం అనే అంశానికి డబ్బులతో ముడిపెట్టరాదు. ఇది ఆర్థిక అంశం కన్నా అత్యంత కీలకమైన కుటుంబ బంధం. ప్రత్యేకించి సోదరి సోదరుల మధ్య అనుబంధానికి విశిష్టత ఉంటుంది. అవసరం అయినప్పుడు ఆపదలో ఉన్న తోబుట్టువులను ఆదుకునేబాధ్యత కుటుంబంలోని తండ్రి తరువాతి తరం వారిపై ఉంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనరాదు. చెల్లిని లేదా అక్కను అన్ని విధాలుగా ఆదరించాల్సిన బాధ్యత అన్న లేదా తమ్ముడిపై ఉంటుంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిలో కుటుంబ సభ్యుల మధ్య కలివిడి తనం అత్యంత ప్రధాన అంతర్లీన అంశం అన్నారు. ఓ కుటుంబంలో విడాకులు పొందిన మహిళ తన భర్త నుంచి తనకు వచ్చే భరణం పెంచాలని, ఆయనపై ఆధారపడి 79 ఏండ్ల తండ్రి, రెండో భార్య, విడాకులు పొందిన సోదరి , ఓ కూతురు ఉన్నారని , సోదరిని ఆయన ఎందుకు భరించాలని, తనకు వచ్చే పరిహారం మొత్తం పెంచాల్సి ఉందని పిటిషనర్ తెలియచేసుకున్నారు. ఈ దశలో సోదరిని చూసేబాధ్యత సోదరిపై ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News