Wednesday, July 9, 2025

బాంద్రా వెస్ట్‌లో భవనం కూలి ఒకరు మృతి, 16 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Collapse

ముంబై:  బాంద్రా వెస్ట్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి G+2 నిర్మాణం కూలిపోవడంతో ఒకరు మరణించారు, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. “ఒక వ్యక్తి దురదృష్టవశాత్తూ శాస్త్రి నగర్‌లోని G+2 ఇల్లు కూలిపోవడంతో మరణించాడు. మా ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబ సభ్యులతో ఉన్నాయి. 16 మంది స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాయపడిన మరికొందరి నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి” అని బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది.

“ఈరోజు(బుధవారం) అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో భవనం కుప్పకూలింది. ఒక వ్యక్తి మరణించాడు,  16 మంది ఆసుపత్రి పాలయ్యారు,  ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. వీరంతా బీహార్‌కు చెందిన కూలీలు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అగ్నిమాపక దళం , అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు ”అని డిసిపి ముంబై పోలీస్ మంజునాథ్ సింగే తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News