Sunday, May 5, 2024

నగరంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

special drive of traffic police in hyderabad

ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహణ
టింటెడ్ గ్లాసెస్, నంబర్ ప్లేట్, టెంపరరీ నంబర్లపై తనిఖీలు
ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాసు,బ్లాక్ ఫిల్మ్, నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు, టెంపరరీ నంబర్ రిజిస్ట్రేషన్ తదితర వాటిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించేందుకు హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. నగర వాహనదారులకు మోటారు వాహనాల చట్టంపై అవగాహన కల్పించేందుకు తనిఖీలు నిర్వహించనున్నట్లు జాయింట్ సిపి ట్రాఫిక్ ఎవి రంగనాథ్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ నంబర్ 9010203626కు సమాచారం ఇవ్వాలని, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్టింగ్ పెట్టాలని కోరారు. కార్లకు మోటార్ వాహనాల చట్టం ప్రకారం 70శాతం లోపలి భాగం కన్పించేలా బ్లాక్ ఫిల్మ్‌ను ముందు, వెనుక గ్లాస్‌కు అమర్చుకోవాలి. సైడ్ గ్లాస్‌కు 50శాతం వరకు అనుమతి ఉంది. వాహనాలకు నంబర్ ప్లేట్ వాహనాల చట్టం ప్రకారం బిగించుకోవాలి. టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ః ఎంవి యాక్ట్ సెక్షన్ 43 ప్రకారం నెల రోజుల వరకు మాత్రమే అనుమతి ఉంది. తర్వాత వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News