Tuesday, May 7, 2024

ప్రజాస్వామ్యం ముసుగులో ఫాసిస్టు చర్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఐదవ రోజు తమ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల సత్యాగ్రహం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇడిని దుర్వినియోగం చేస్తూ రాహుల్ గాంధీని వేధిస్తోందని వారు ఆరోపించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తోసహా పలువురు కాంగ్రెస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం వారంతా ఎఐసిసి కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు ఊరేగింపు నిర్వహించడానికి ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేయడానికి అనుమతి ఇచ్చామే తప్ప ఊరేగింపు నిర్వహించడానికి కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఎఐసిసి వెలుపల రోడ్డుపై బఘేల్ తన మద్దతుదారులతో ధర్నా చేయగా ప్రజలను వంచించడానికి ప్రజాస్వామ్యం ముసుగులో ఫాసిస్టు చర్యలకు బిజెపి నాయకులు పాల్పడుతున్నారని గెహ్లాట్ ఆరోపించారు. బిజెపి నాయకులు ఫాసిస్టులని, ప్రజాస్వామ్యం ముసుగులో వారు చెలామణి అవుతున్నారని గెహ్లాట్ ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ సాంఘిక స్వరూపాన్ని వారు విచ్ఛిన్నం చేస్తున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు.

Congress protest in AICC Headquarters over ED Investigation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News