Friday, September 12, 2025

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై చర్య తీసుకోవాలి: దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

Take action on online loan apps

 

హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల మాఫియా కారణంగా అనేక మంది అమాయకుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌లను రద్దు చేయాలని సిఎం కెసిఆర్ కు డా. దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌ల మాఫియాని దుర్మార్గలని ఆధారాలతో లేఖలో వివరించారు. ప్రతి నిత్యం ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పిర్యాదులు వస్తున్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అన్ని ఆన్‌లైన్ లోన్ యాప్‌లను అణిచివేయాలని సూచించారు.

  ఆన్ లోన్ యాప్‌ల చట్టవిరుద్ధంగా ప్రవేశించకుండా నిరోధించడానికి బలమైన సైబర్ సెక్యూరిటీ ఫైర్‌వాల్‌లను ఏర్పాటు చేయాలని దాసోజు డిమాండ్ చేశారు.  సమస్యను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేకమైన ఇ మెయిల్ ఐడితో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్బీఎఫ్ సి రిజిస్ట్రేషన్, ఆర్బీఐ ఆమోదం ఉన్న యాప్‌లకే అనుమతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులు చిన్న, మధ్యతరహా, చిరు వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాల పేదలకు రుణాలు ఇచ్చేలా పాలసీలు తేవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News