Friday, May 17, 2024

హన్మకొండ రణరంగం

- Advertisement -
- Advertisement -

బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడి మాజీ మేయర్ స్వర్ణకారు
ధ్వంసం సిఐ గన్‌మన్‌కు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

మన తెలంగాణ/హన్మకొండ టౌన్: హన్మకొండ హంటర్ రోడ్డు రాజ్ హోటల్ జంక్షన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో అగ్నిపథ్‌ను రద్దు చేయాలని కోరుతూ శు క్రవారం ధర్నా చేపట్టారు. ఇదే క్రమంలో పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో హైదరాబాద్ మోడీ సభకు సంబంధించిన సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజస్థాన్ బిజెపి రాజ్యసభ సభ్యుడు ఓంప్రకాష్ మాధుర్ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించారు. ధర్నా మం పక్కనే కావడంతో ఒక్కసారిగా బిజెపి కార్యకర్తలు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై విరుచుకుపడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంట తెచ్చుకున్న కర్రలతో ఒకరిపై ఒకరు దాడు లు చేసుకున్నారు. ఇదే క్రమంలో పక్కనే ఉన్న మా జీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారును కర్రలతో ధ్వం సం చేశారు.

విషయం తెలుసుకున్న సుబేదారి, కాకతీయ వర్శిటీ సిఐలు అప్రమత్తమై తమ సబ్బందితో దాడి సంఘటన వద్దకు చేరుకొని ఇరువర్గాలను అదుపుచేస్తున్న క్రమంలో సుబేదారి సిఐ గన్‌మెన్ అనిల్ తలకు బలమైన గాయంకావడంతో అ తన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గా యానికి కారకులైన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరువర్గాలను శాంతిపచేసి అల్లరిచేస్తున్న బిజెపి, కాం గ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండ గా, 53వ డివిజన్ లష్కర్ సింగారంలోని బిజెపికి చెందిన దళిత కార్యకర్తలను కలవడానికి వెళ్తున్న రాజస్థాన్ బిజెపి రాజ్యసభ సభ్యుడు ఓంప్రకాష్ మాధూర్ సాహును పోలీసులు అడ్డుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News