Saturday, August 16, 2025

బీహార్‌లో వ్యాపారి కాల్చివేత..

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో శనివారం ఉదయమే ఓ వ్యాపారిని దుండగులు కాల్చిచంపారు. రాష్ట్రంలోని కతిహార్‌కు చెందిన 35 సంవత్సరాల వ్యాపారి మేఘనాథ్ యాదవ్ భార్యతో కలిసి స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించి తిరిగి వెళ్లుతుండగా దారుణం జరిగింది. భార్యకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆమె ఇప్పుడు కతిహార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కతిహార్‌లోని అజంనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాదారిలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం బీహార్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులలోకి వస్తుంది.

Business Man shot dead in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News