Thursday, August 21, 2025

పెళ్లి పీటలు ఎక్కిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

- Advertisement -
- Advertisement -

 

Bhagwant Mann marriage

చండీగఢ్: భగవంత్ మాన్, గుర్‌ప్రీత్ కౌర్ వివాహం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వారిరువురు వివాహబంధంతో ఒకటయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సమేతంగా వివాహ వేడుకలో పాల్గొన్నారు. పైగా ఆయన పెళ్లి కుమారుడి తండ్రి స్థానంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివాహం ముఖ్యమంత్రి ఇంటి వద్దే నిర్వహించారు. భగవంత్ మాన్ వయస్సు 48 ఏళ్లు కాగా, వధువు గుర్‌ప్రీత్ వయస్సు 32 ఏళ్లు. ఆమె అతడికన్నా 16 ఏళ్లు చిన్నది. వారిరువురి మధ్య పరిచయం నాలుగేళ్ల క్రితమే జరిగింది. ఇది భగవంత్ మాన్‌కు రెండో పెళ్లి. అతడి మొదటి పెళ్లి 2015లో జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News