Wednesday, May 8, 2024

టెక్నీషియన్లపై ‘ఇండిగో’ క్రమశిక్షణా చర్యలు

- Advertisement -
- Advertisement -

'IndiGo' disciplinary action against technicians

న్యూఢిల్లీ : తక్కువ వేతనాలకు నిరసనగా ఉద్యోగులు మూకుమ్మడిగా సిక్ లీవ్(అనారోగ్య సెలవు) తీసుకోవడం పట్ల ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఐదు రోజులుగా సిక్ లీవ్ తీసుకుని సేవలకు అంతరాయం కల్గిస్తున్న టెక్నీషియన్లపై సంస్థ క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. అవసరమైన వైద్య పత్రాలతో విమాన సంస్థ వైద్యుడికి తక్షణమే రిపోర్ట్ చేయాలని సెలవుపై వెళ్లిన ఉద్యోగులను ఇండిగో ఆదేశించింది. మంచి ఇంక్రిమెంట్లు లేనందుకు నిరసనగా హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన కేంద్రాలలో పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు సెలవు తీసుకున్నారు. అంతకుముందు జూలై 2న ఇండిగో క్యాబిన్ క్రూ ఎక్కువ సంఖ్యలో సెలవు తీసుకోగా, 55 శాతం ఇండిగో విమానాలు ఆలస్యం అయ్యాయి. ఎయిర్ ఇండియా నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు గాను ఇండిగో క్యాబిన్ సిబ్బంది సిక్ లీవ్ తీసుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఇండిగో తన పైలట్ల జీతంలో 28 శాతం వరకు కోత విధించింది . ఈ ఏడాది ఏప్రిల్ 1న పైలట్ల జీతాలను 8 శాతం, మరోసారి 8 శాతం పెంచుతూ ఎయిర్‌లైన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయినప్పటికీ ప్రస్తుత జీతాలు 2020కి ముందు ఉన్న స్థాయిల కంటే 16 శాతం తక్కువగా ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News