Monday, May 13, 2024

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా

- Advertisement -
- Advertisement -

 

BSNL and MTNL

ఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ విలీనం ప్రతిపాదనను వాయిదా వేసినట్లు కేంద్రమంత్రి చౌహాన్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి  అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహాన్ సమాధానమిచ్చారు. ఈ రెండు ప్రభుత్వసంస్థలను విలీనం చేసే ప్రతిపాదనకు.. 2019లో ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. ఎంటీఎన్‌ఎల్‌  భారీగా రుణాల ఊబిలో కూరుకుపోయిందని, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థికపరిస్థితి ప్రతికూలంగా ఉందని పేర్కొన్నారు. ఎంటీఎన్‌ఎల్‌ 2016 నుంచి వరుసగా ప్రతి ఏటా నష్టాలు వచ్చాయని చౌహాన్‌ తెలిపారు. ఎంటీఎన్‌ఎల్‌ రుణ భారం నుంచి కుదుటపడే వరకు విలీనం ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎంటీఎన్‌ఎల్‌ను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని చౌహాన్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News