Saturday, May 4, 2024

షిండే ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలొస్తాయి

- Advertisement -
- Advertisement -

Shinde's government collapses and by-elections are held

శివసేన నేత ఆదిత్యథాకరే జోస్యం

పైథాన్ : మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం త్వరలో కుప్పకూలి మధ్యంతర ఎన్నికలు వస్తాయని శివసేన నేత ఆదిత్యథాకరే శనివారం జోస్యం చెప్పారు. శివ్ సంవాద్ యాత్ర పేరున చేపట్టిన ప్రచార ఉద్యమం మూడో రోజు శనివారం కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్వస్థత పాలైన సమయంలో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్‌ఎల్‌ఎలు తన తండ్రిని మోసగించారని ఆరోపించారు. పైతాన్ నియోజక వర్గానికి చెందిన సేన ఎమ్‌ఎల్‌ఎ , మాజీ మంత్రి సందీపన్ భూమ్రే షిండే వర్గంలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదిత్య థాకరే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయి, మధ్యంతర ఎన్నికలను రాష్ట్రం ఎదుర్కోక తప్పదని, ఈ మాటలను గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఇదివరకటి సేనఎన్‌సిపికాంగ్రెస్ ప్రభుత్వం లో నిధులు వచ్చేవి కావని భూమ్రే చేసిన వ్యాఖ్యలను థాకరే తోసిపుచ్చారు. మరఠ్వాడా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద పైథాన్ రీజియన్ మొట్టమొదటి స్కీమ్‌ను పొందగలిగిందని ఆదిత్య థాకరే గుర్తు చేశారు. గత 15 రోజుల్లో వర్షభీభత్సంతో అనేక మంది ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ఇద్దరితోనే (షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ ) ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. అసలైన శివసేనలో మళ్లీ చేరడానికి తిరిగి రావాలనుకునే తిరుగుబాటు ఎమ్‌ఎల్‌ఎలు రావచ్చని, వారికి పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రెబెల్ ఎమ్‌ఎల్‌ఎలకు ఆయన పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News