Friday, May 10, 2024

రూ. 28 కోట్లు భళ్లుమన్న తిమింగలం

- Advertisement -
- Advertisement -

Fishermen hand over whale vomit worth ₹28 crore to authorities

అంబర్‌గ్రిస్‌ను పోలీసుకు అప్పగించిన జాలర్లు

తిరువనంతపురం : కేరళ తీరంలో అత్యంత అరుదైన తిమింగలం వాంతి చేసుకుంది. 28 కోట్ల రూపాయల విలువైన ఈ తిమింగల వాంతిని పసికట్టి సేకరించిన అక్కడి జాలర్లు దీనిని వెంటనే సమీపంలోని పోలీసు అధికారులకు అప్పగించారు. తగు పారితోషికం పొందారు. సాధారణంగా తిమింగలాల వాంతిని అంబర్‌గ్రిస్ అని వ్యవహరిస్తారు. ఏకంగా 28 కిలోలకు పైగా ఉన్న ఈ వాంతిని జాలర్లు సముద్రంలో గుర్తించారు. అది సముద్రపు అలలపై తట్టులాగా విస్తరించుకుని ఉంది. దీనిని కనుగొని జాలర్లు తీర ప్రాంత పోలీసులకు అప్పగించారు. వెంటనే దీనిని అటవీశాఖ ద్వారా రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌జిసిబి)కి తీసుకువెళ్లి అప్పగించారు. అత్యంత ఖరీదైన పరిమళ ద్రవ్యాల తయారీకి ఈ తిమింగల వాంతిని వాడుతారు.ఈ క్రమంలో ఈ కిలో అంబర్‌ట్రిస్ ధర రూ కోటి పలుకుతోంది. ఈ విధంగా దీని విలువ మార్కెట్‌లో 28 కోట్ల వరకూ ఉంటుంది. వన్యప్రాణి రక్షణ చట్టం పరిధిలో దేశంలో దీని క్రయవిక్రయాలను నిషేధించారు. అంతరించిపోతున్న ఈ స్పెర్మ్ వేల్‌ను పరిరక్షించేందుకు ఈ ప్రాణి సంబంధిత లాలాజలం మొదలుకుని అన్నింటిని భద్రపరుస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News