Saturday, May 4, 2024

పశువులకు ఆడ దూడలు జన్మించేలా కృత్రిమ గర్భధారణ

- Advertisement -
- Advertisement -

పశు సంపద వృద్ధితో రైతులకు ఆదాయం
డిఎల్డీఎ చైర్మన్ పిచ్చిరెడ్డి

Artificial insemination of cattle to produce female calves

మన తెలంగాణ/మోత్కూరు: పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడ దూడలు జన్మించేలా త్వరలో వీర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, రైతులు కోరుకున్న విధంగా మేలు రకం ఆడ దూడలు జన్మిస్తాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డిఎల్ డిఎ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి తెలిపారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ క్లస్టర్ రైతువేదికలో మంగళవారం ఉమ్మడి నల్లగొండ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సు, ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి మాట్లాడారు. పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో ఆడదూడలు జన్మించేలా ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా వీర్య నాలికలను విడదీసి వీర్యాన్ని ఇచ్చినట్టయితే మేలురకం ఆడ దూడలు మాత్రమే జన్మిస్తాయన్నారు.

రూ.675 విలువ కలిగిన వీర్యాన్ని రైతులకు సబ్సిడీపై రూ.250కి అందిస్తామని, మొదటిసారి చూడి నిల్వకుండా రెండోసారి చేస్తే రైతులకు రూ.250 తిరిగి చెల్లిస్తామన్నారు. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశు సంపదను పెంచుకోవాలని, పశుపోషణ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. పశువైద్యశాఖ ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని పశుసంపదలో మండలాన్ని అగ్రగామిగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ దండెబోయిన మల్లేష్, ఉపసర్పంచ్ కృష్ణ, జిల్లా వెటర్నరీ అధికారి కృష్ణ, సహాయ సంచాలకులు మోతీరాం, ఈవో మల్లిఖార్జున్, వెటర్నరీ డాక్టర్లు వల్లాల సంతోష్, అనిల్‌రెడ్డి, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News