Thursday, May 2, 2024

రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్

- Advertisement -
- Advertisement -

Don't harass borrowers:RBI

రుణగ్రహీతలను వేధించొద్దు.. వ్యక్తిగత గోప్యతకు
భంగం కలిగించొద్దు బ్యాంకులు, రుణ సంస్థలకు
రిజర్వ్‌బ్యాంక్ కీలక ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రుణ వసూళ్లులో రికవరీ ఏజెంట్లు చే స్తున్న దారుణాలను అరికట్టేందుకు రిజర్వ్‌బ్యాంక్ మరిన్ని నిబంధనల ను అమలుల్లోకి తీసుకొచ్చింది. తా జాగా విడుదల చేసిన ప్రకటనలో ‘షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి) ఈ నిబంధనలను తమ రుణ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా పాటించేలా చూడాలని రిజర్వ్‌బ్యాంక్ స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలకు ఫోన్ చేయాలని పేర్కొంది. అర్ధరాత్రుళ్లు, వేకువజామున ఏజెంట్లు వేధిస్తున్నారని ఫిర్యాదులు అధికమైన నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ ఆదేశాలిచ్చింది. రికవరీ ఏజెంట్లు రుణ వసూళ్లులో భాగంగా మాటల రూపంలో అయినా, భౌతికంగా అయినా రుణగ్రహీతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించకూడదు. ఈ విషయాన్ని బ్యాంకులు తమ ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలి. రుణగ్రహీతల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు.

అప్పు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకూ, రిఫరెన్సుగా పేర్కొన్న వారికీ, స్నేహితులకు మొబైల్, సామాజిక వేదికల ద్వారా సందేశాలు పంపించకూడదు. వారిని భయపెట్టేందుకు ప్రయత్నించకూడదు. రుణగ్రహీత గురించి ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ అని ఆర్‌బిఐ తాజా ప్రకటనలో ఆదేశించింది. సంబంధిత రికవరీ ఏజెంట్ల చర్యలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ హెచ్చరించింది. శుక్రవారం జారీ చేసిన మార్గదర్శకాలు.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ సంస్థలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సూక్ష్మ రుణాలకు ఈ సర్క్యులర్ వర్తించదని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News