Friday, May 10, 2024

స్వల్పహెచ్చు తగ్గులతో కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

12608 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీలో ఆగస్టు 1 నుంచి కరోనా బాధితుల్లో 60 శాతం మంది ఆస్పత్రుల్లో చేరినట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా 1600 లకు పైగా కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరువైంది. మహారాష్ట్రలో 1800 కు పైగా కేసులు రాగా, ఒక్క ముంబై లోనే ఆ సంఖ్య 975 గా ఉంది. కేరళలో కూడా వెయ్యికి పైగా కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కలిపి దేశ వ్యాప్తంగా 12 వేల మందికి పైగా కరోనాబారిన పడ్డారని గురువారం కేంద్రం తెలియజేసింది. 24 గంటల వ్యవధిలో 3.62 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 12,608 కొత్త కేసులు వచ్చాయి. ముందు రోజు కంటే మూడు వేల మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. 16,251 మంది కోలుకున్నారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు 1,01,343( 0.23 శాతం)కి తగ్గాయి. ఇప్పటివరకు 4.42 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, 98.58 వాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి 208 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా, బుధవారం 38.64 లక్షల మంది టీకా తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News