Monday, May 6, 2024

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Distributes New Pension Cards

హైదరాబాద్: పేదప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,ఇందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చైనా వెనకడే ప్రసేక్తే లేదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ ఆర్‌డిఒ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రూ. 200ల పెన్షన్ ను ఇచ్చే వారని, అవి కూడా సకాలంలో రాక లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసరా పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్నివయో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 2,016, వికలాంగులకు రూ.3,016లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి ఆసరాపెన్షన్ లు అందుతుండగా వజ్రోత్సవ వేడుకల శుభతరుణంలో స్వాతంత్ర దినోత్సవం ఈ నెల 15 నుంచి కొత్తగా 57 ఏళ్ల దాటిన మరో 10 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు.

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్ మండలాల పరిధిలో ప్రస్తుతం 30 వేల మందికి ఆసరా పెన్షన్లను తీసుకుండగా , నూతనంగా మరో 16 వేలకు పైగా పెన్షన్ లు మంజూరైనాయని తెలిపారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమంంతో పాటు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, హేమలత, మహేశ్వరి, సుచిత్ర, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆర్‌డిఓ వసంత, తహసీల్దార్ లు విష్ణుసాగర్, శైలజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News