Sunday, August 24, 2025

’లైగర్’ సినిమాకు బాయ్ కాట్ సెగ ?

- Advertisement -
- Advertisement -

 

Liger pre-release

గుంటూరు: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ కథానాయకుడుగా రాబోతున్న చిత్రం ‘లైగర్’. శనివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక గుంటూరులో జరిగింది. అంతకు ముందు ఆ సినిమా బృందం విజయవాడలో విలేకరులతో మాట్లాడింది. ఆ సందర్భంలో ‘బాయ్‌కాట్ లైగర్’ అంశంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు నటుడు విజయ్ దేవరకొండ దీటుగా స్పందించారు. తాము సినిమా మొదలెట్టినప్పుడు ఈ గొడవలేదన్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ దేశవ్యాప్తంగా తీసుకెళుతున్నారన్నారు. అసలు బాలీవుడ్‌లో ఏం గొడవో పూర్తిగా తెలియదన్నారు. దేశంలో తాము ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రజలు ప్రేమచూపుతున్నారన్నారు, మనపాటికి మనం పాటుపడ్డాం, ఎవరి మాటా వినాల్సిన పనిలేదు. ప్రతికూలతలను ఎదుర్కొంటాం. పైకి వెళుతుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకొద్దు అన్నారు. ‘లైగర్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News