Saturday, May 4, 2024

మీటర్‌పై మాటెత్తని షా

- Advertisement -
- Advertisement -

విద్యుత్ చట్టంపై సమాధానం దాటవేత

చట్టాన్ని కాదు.. ప్రభుత్వాన్ని
మార్చాలని ఆదర్శ రైతులకు
హోం మంత్రి సలహా
బిత్తరపోయిన రైతులు పిఎం
కిసాన్ యోజనను రూ.15వేలకు
పెంచాలని వినతి బేగంపేటలో
రైతులతో వ్యవసాయం,
పంట నష్టంపై అమిత్ షా చర్చ

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యుత్ చట్టాల రద్దుకు సంబంధించి మోడీ దాటవేతలతో వ్యవసాయరంగానికి మళ్లీ నిరాశే ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యుత్ చట్టం సవరణతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తారనన్న సందేహాల ను వెలిబుచ్చుతూ కేంద్ర హోంశాఖ మం త్రి అమిత్‌షా ముందు రైతులు ఆందోళన వ్యక్త పరిచారు. రైతులు లేవనెత్తిన సందేహాలకు అమిత్ షా స్పష్టత ఇవ్వకపోగా, విద్యుత్ చట్టంలో మార్పులు కాదు ప్రభుత్వాన్నే మార్చాలని చేసిన ప్రకటనతో రైతులు బిత్తర పోవాల్సివచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చట్టంలో సరవరణలు ప్రతిపాదించి వ్యవసాయ మోటార్లన్నింటీకి మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధ్ద సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్‌షా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సందర్భంగా బేగంపేటలో అమిత్‌షా ఆదర్శ సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర ప్రతిపాదించిన విద్యుత్ చట్టాలు,సేంద్రియ వ్యవసాయం , మద్దుతు ధరలు, ధాన్యం కోనుగోళ్లు , పంటల బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి యోజన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పంటల సాగుకు సంబంధించి రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు చేసిన ప్రతిపాదనను రైతులు కేంద్ర మంత్రి అమిత్‌షా ఎదుట ప్రస్తావించారు. కొత్త విద్యుత్ చట్టం పట్ల ఆందోళన వ్యక్త పరిచారు.

కేంద్ర విద్యుత్ చట్టం మార్పుల ప్రతిపాదన రద్దు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై అమిత్ షా సమావేశంలో రైతులకు తగిన స్పష్టత ఇచ్చి రైతుల సందేహాలను నివృత్తి చేయకపోగా, మార్చాల్సింది కేంద్ర విద్యత్ చట్టం కాదని, ఇక్కడి ప్రభుత్వాన్నే అని ఎదురు ప్రశ్నలు వేయడంతో రైతులు బిత్తర పోవాల్సివచ్చింది. రైతులు అడిగిన వాటిలో దేనికి అమిత్‌షా స్పష్టమైన బదులివ్వకుండా దాట వేత ధోరణి, ఎదురు ప్రశ్నలతో రైతులు నిరుత్సాహానికి లోనయ్యారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో అమిత్‌షా ఆదర్శరైతులకు సేంద్రియ సాగు బోధించారు. త్వరలోనే ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయరంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రైతులకు అంతగా ఉపయుక్తంగా లేదని ఈ పథకం మార్పులు చేయాలని కోరుతూ పక్కన పెట్టిన ఫసల్ పథకం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పలువురు ఆదర్శరైతులు ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకుపోయారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మరికొందరు కిసాన్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో సేంద్రియ వ్యవసాయం కలిగే ప్రయోజనాలతో ఫసల్ బీమా అమలు పథకంపైనా చర్చించారు.

దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలు , ఆకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లుతున్నా తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రైతులకు ఏటా అందజేస్తున్న రూ.6000 ఏమూలకు చాలటం లేదని రైతులు కేంద్ర మంత్రిఅమిత్ షాకు వివరించారు. అర్హత కలిగిన రైతులందరీకీ ఫసల్ బీమా వర్తింపజేయాలని కోరారు. అంతే కాకుండా పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోయాయని తెలిపారు. పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.15వేలు అందజేయాలని కేంద్ర మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పండించే ధాన్యాన్ని ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోలు చేయించాలని కోరారు. రూపాతెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ తనకు గతంలో 10 ఎకరాల భూమి ఉండగా, వ్యవసాయంవల్ల తీవ్రంగా నష్టాలు వచ్చాయన్నారు. దీంతో కొంత భూమిని అమ్మేసి సేంద్రియ వ్యవసాయం ఆరంభించానన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా కరోనా సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు తన వద్దకు వచ్చి సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేసి తీసుకెళ్లారని చెప్పారు. సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తనకున్న 20 ఎకరాల్లో తెలియకుండా రసాయన ఎరువులు వాడడంతో పంట దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు. తనవద్ద మేలు జాతి (ఇక్కీస్) గోవులున్నాయని, అందులో ఒకటి ఒక గోమాత 12వ జనరేషన్‌కు చెందినదని తెలిపారు. ఆ గోమాతకు మహాలక్ష్మీగా నామకరణం చేసి మనవడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని అమిత్ షా వివరించారు. గోమాత పేడను సేంద్రీయ ఎరువులుగా వాడటంవల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వెనుకబడి ఉన్నామంటూ కొందరు రైతులు అమిత్ షా దృష్టికి తీసుకురాగా, అతి త్వరలోనూ అమూల్ సంస్థ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్‌లో తగిన ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో 5 సేంద్రియ వ్యవసాయ లాబోరేటరీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులపై పరీక్షలు చేయడంతోపాటు సేంద్రీయ ఉత్పత్తులు పండించే భూముల్లో ఏటా రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు అమిత్‌షా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News